ఎకరం 264 కోట్లు
రాయదుర్గంలో భూమికి రికార్డు ధర
పాన్‌మక్తా పరిధిలోని 5.25 ఎకరాలకు టీజీఐఐసీ వేలం
ప్రభుత్వానికి సమకూరిన భారీ ఆదాయం
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో భూముల ధరలు మరోసారి రికార్డుస్థాయికి చేరాయి. రాష్ట్ర రాజధానిలోని కీలక ఐటీ కారిడార్‌గా ఉన్న రాయదుర్గంలో భూముల ధరలు మునుపెన్నడూ లేనిస్థాయిలో పలుకుతున్నాయి. తాజాగా తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన ఈ -వేలంలో రాయదుర్గం పరిధిలోని భూమి ఎకరం ఏకంగా రూ.264 కోట్లకు అమ్ముడుపోయింది.
దీంతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భూముల ధరల దూకుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాయదుర్గం సర్వే నంబర్ 83/1లోని పాన్‌మక్తా పరిధిలో ఉన్న 5.25 ఎకరాల భూమిని టీజీఐఐసీ వేలం వేసింది. ఇందులో ఎకరం రూ.264 కోట్ల ధర పలకడంతో భారీ మొత్తంలో ఆదాయం సమకూరింది. కీలకమైన ఐటీ, వాణిజ్య ప్రాంతాలకు సమీపంలో ఉన్న ఈ భూములకు డిమాండ్ పెరుగుతుండటంతో వేలంలో పోటీ కూడా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తున్నది.
రాయదుర్గంలో భూముల ధరలు వరుసగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదే సర్వే నంబర్ 83/1లో మే 2026లో టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో 6.29 ఎకరాల భూమి ఎకరం రూ.237 కోట్లకు అమ్ముడుపోయింది. అప్పటివరకు దేశంలోనే అత్యధిక ధరగా ఇది రికార్డు సృష్టించింది. తాజాగా రూ.264 కోట్ల ధరతో ఆ రికార్డును కూడా అధిగమించింది. అదే సర్వే నంబర్‌లో జూన్ 2026లో నిర్వహించిన మరో వేలంలో 5.09 ఎకరాల భూమి ఎకరం రూ.204 కోట్లకు అమ్ముడైంది.
2025 అక్టోబర్‌లో రాయదుర్గంలో నిర్వహించిన వేలంలో ఎకరం రూ.177 కోట్ల ధర పలికింది. తక్కువ వ్యవధిలోనే ధరలు భారీగా పెరగడం ఐటీ కారిడార్‌లో భూములకు ఉన్న డిమాండ్‌కు అద్దం పడుతున్నది. రాయదుర్గం ప్రాంతం మైండ్ స్పేస్, నాలెడ్జ్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి కీలక వాణిజ్య ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఉండటం ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఐటీ, ఫైనాన్షియల్, కార్పొరేట్ సంస్థలకు అనువైన ప్రాంతంగా రాయదుర్గం ఇప్పటికే గుర్తింపు పొందింది.
అదే సమయంలో కీలకమైన బిజినెస్ కారిడార్లలో పెద్ద విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములు పరిమితంగా ఉండటం కూ డా ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. భవనాల ఎ త్తుకు సంబంధించిన నిబంధనల్లో సడలింపులు ఉండ టంతో భారీ బహుళ అంతస్తుల వాణిజ్య సముదా యాల నిర్మాణానికి అవకా శం ఏర్పడుతున్నది. దీంతో ప్రముఖ రియల్ ఎస్టేట్, కా ర్పొరేట్ సంస్థలు ఈ ప్రాం తంలోని భూములపై ఆసక్తి చూపుతున్నాయి.
రాయదుర్గంలో వరుసగా నిర్వహిస్తున్న భూముల వేలాలు ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ప్రతి వేలంలో గత రికార్డులు బద్దలవుతుండటంతో భవిష్యత్‌లో ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూము లకు మరింత ధర పలికే అవకాశాలపై ఆసక్తి నెలకొన్నది. మొత్తంగా చూ స్తే.. రాయదుర్గం కేంద్రంగా హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో భూముల ధరలు దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తున్నా యి. ఎకరం రూ.264 కోట్లకు చేరడం ఈ ప్రాంతంలో భూముల డిమాండ్, వాణి జ్య అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంచేస్తున్నది.






