22 August, 2026 | 11:37 AM

నిజామాబాద్‌లో మంత్రి పొంగులేటి పర్యటన

22-08-2026 09:56 AM

నిజామాబాద్ టౌన్: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad district) మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పర్యటిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు టవర్లు, 2బిహెచ్‌కె ఇళ్ల నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం లబ్ధిదారులతో సంభాషించారు. పాములబస్తీలో ఇందిరమ్మఇళ్లను పొంగులేటి ప్రారంభించారు. పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

రెండు విడతల్లో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లు(Indiramma houses) మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 లక్షల ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేశామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని సూచించారు. పేదలందరికీ ప్రజా ప్రభుత్వం న్యాయం చేస్తోందని మంత్రి పొంగులేటి(Minister Ponguleti ) భరోసా కల్పించారు. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగాయని మంత్రి ఆరోపించారు. లబ్ధిదారుల ఎంపిక మళ్లీ పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. కొత్త టెక్నాలజీతో ఇందిరమ్మ టవర్స్(Indiramma Towers) నిర్మాణం చేస్తామని మంత్రి వెల్లడించారు. నిజామాబాద్ లో నూ త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తామని తెలిపారు.