కంప్యూటర్ సైన్స్‌లో కనుగుట్ట యువకుడికి పీహెచ్‌డీ
బోథ్, ఆగస్ట్ 22 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన కుమ్మరి రాకేష్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ పట్టా సాధించాడు. తెలుగు భాష కోసం అధిక పని తీరు కలిగిన ఆప్టికల్ క్యారెక్టర్ ఆర్గనైజేషన్ అభివృద్ధి అనే అంశంపై ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి భగవతి ఆధ్వర్యంలో పరిశోధన చేసి పీహెచ్‌డీ పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా లాటిన్ భాషలైన చైనీస్ జపనీస్ కొరియర్లకు ముద్రిత అక్షరాల ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ కొరకు సాంకేతికథ ఇదివరకే అందుబాటులోకి రాగా అనేక సాఫ్ట్వేర్ ప్యాకేజీలు కూడా ఉన్నాయి.
భారతీయ భాషల్లో ముఖ్యంగా తెలుగు కు సంబంధించిన ఈ ప్రక్రియ ఇంకా పరిశోధనలో ఉంది. అందుకుగాను చేతిరాత అక్షరాలకు సంబంధించిన ప్రామాణిక నెట్వర్క్ ఎన్ కోడర్ డికోడర్ నిర్మాణం గురించి పరిశోధనలు చేశారు. రానున్న రోజుల్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మరిన్ని పరిశోధనలు చేయనున్నట్టు రాకేష్ వివరించారు. మండలంలోని కనుగుట్ట గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి కౌటా(భి) పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. హైదరాబాదులో ఎంటెక్ యూనివర్సిటీ లో పూర్తి చేయడం జరిగింది.. ప్రస్తుతం కేఎల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. పిహెచ్డి పట్టా పొందడంతో కనుక గ్రామానికి చెందిన ప్రజలతోపాటు తల్లిదండ్రులు కుమ్మరి రాములు రూప లు హర్షం వ్యక్తపరుస్తున్నారు






