ముమ్మాటికీ ఆర్టీఏ అధికారుల వైఫల్యమే..
-మీర్జాగూడ బస్సు ప్రమాదం దిగ్బ్రాంతికరం
-ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డా.దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాద దృశ్యాలు పలు హృదయాలను కలిచివేస్తున్నాయని, ఇప్పటివరకు 19 మంది మృతి చెందడం పై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.
బస్సు ప్రమాదంపై బాధ్యత వహించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలలో చాల రోడ్లు గుంతలు ఏర్పడి, కంకర తేలి అత్యంత ప్రమాదకరమైనవిగా మారాయని, రోడ్లు బాగు చేయ డంలో ప్రభుత్వం ఫుర్తిగా విఫలమైందన్నా రు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మీర్జాగూడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేసి యా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. గాయపడ్డ బాధితులకు 25 లక్షల పరిహారంతోపాటు హైదరాబాద్‌లో కార్పొరేట్ వైద్యం అందించాలని సుధాకర్ డిమాండ్ చేశారు.






