చర్చ.. రచ్చ రచ్చ
- ఎన్నిక అయ్యింది ఎవరు? సమాచారం ఎవరికిస్తుండ్రు
- జడ్చర్ల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం అతలాకుతలం
- ప్రజల సమస్యలు గాలికి.. పవర్ ఉన్నోళ్లదే పైచేయి
- చర్చకు తావిస్తున్న జడ్చర్ల మున్సిపాలిటీ
- కాగితలపై కోట్లు చూపిస్తారు అభివృద్ధి ఎక్కడ
జడ్చర్ల, నవంబర్ 3 : సర్వ సభ్య సమావేశం అంటేనే ప్రజా సమస్యలు పై ప్రత్యేక చర్చ జరుపుతూ వాటి పరిష్కారం.. చేయవలసిన పనులు తదితర అంశాలపై సుదీర్ఘం గా చర్చించడం. కాగా కొన్ని సర్వసభ్య సమావేశాలు గొడవలు రచ్చ రచ్చ చేసేందుకే నిల యంగా మారుతున్నాయి. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ఏమైనా అడుగులు పడతాయని ఆశించిన జనానికి ఆమడ దూరం గా ఉంటూ అనవసర చర్చనే ఉబందుకుంటుంది.
ఇటీవల జడ్చర్ల మున్సిపాలిటీలో జరిగిన సర్వసభ్య సమావేశం జడ్చర్ల నియోజకవర్గమంత చర్చ చర్చించేందుకు వేదికగా నిలిచింది.పార్టీలు వేరైనా ఆయా వార్డులలో గెలిచిన కౌన్సిలర్లు వారి వార్డులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో ముం దు వరుసలో ఉంటారు.
కాగా ఇక్కడ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చే స్తున్నారని, దీంతోపాటు మున్సిపాలిటీ పరిధిలో ఏ పనులు చేసినప్పటికీ బిల్లులు తది తర అంశాలను పూర్తిస్థాయిలో వివరించడం లేదని బీఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఈ చర్చ ఇప్పట్లో సర్దుమని పరిస్థితులు కనిపించడం లేదని మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలే చెబుతున్న మాట.
- వాళ్లను కలిస్తేనే పనులు చేస్తే ఎట్లా....
అందరికి కౌన్సిలర్ల లాగా మాదిరిగానే మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు. మా దగ్గరికి కూడా ఎంతోమంది వారి వారి సమస్య లను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకుపోవాలని చెబుతుంటారు. ఆ సమస్యలను పక్కనపెట్టి అధికార పార్టీలో ఉన్న వారికి చెపితేనే ఆ సమస్యలు పరిష్కరిస్తామన్నట్టు మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యత్యా సం తీవ్ర ఆందోళన కురిచేస్తుందని బిఆర్‌ఎస్ నేతలు మున్సిపాలిటీలో జరిగిన సర్వస భ్య సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంఘటనను చోటుచేసుకుంది.
ఉమ్మ డి జిల్లాలోని కేంద్ర బిందువుగా ఉన్న జడ్చర్ల మున్సిపాలిటీ అంచలంచలుగా ఎదిగేందుకు ఎంతో సదుపాయాలు అందుబాటులో ఉన్న విషయం విధితమే. పార్టీల మధ్య ఉన్న అంతర్ యుద్ధాన్ని అభివృద్ధిలో చూపించడం వల్ల భవిష్యత్తు జడ్చర్ల మున్సిపాలిటీ బాగు చేయడంలో ఇబ్బందులు తప్పవని మున్సిపాలిటీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తుండ్రు.
షాడో వ్యక్తుల చేతుల్లో జడ్చర్ల మున్సిపాలిటీ..?
అధికారులు షాడో వ్యక్తులు చెప్తేనే జడ్చర్ల మున్సిపాలిటీలో పనులు జరుగుతున్నాయని ఇది ఎక్కడి విధానం అంటూ ప్రజ ల సైతం ఆవేద మెత్తం చేస్తున్న సందర్భాలు నెలకొంటున్నాయి. ఈ విధానానికి ముగిం పు పలికి ప్రజా సమస్యల పరిష్కరించడంలో మరో అడుగు ముందుకు వేసి అధికారులు ప్రజాప్రతినిధులకు అవసరమైన సముచిత స్థానం కల్పిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని ప్రజలు కోరుతుండ్రు.
ఎవరికి వారై విహరించడం వల్ల ప్రజా సమస్యలు గాలికి పోయే పరిస్థితులు ఉంటాయని, ప్రజల సమస్యలు ముందు ఉంచుతూ ప్రత్యేక చర్యలు తీసుకుంటేనే చెబుతున్న వాట్లకు చేస్తున్న పనులకు సంబంధం ఉంటుందని ప్రజలు ఈ అంశాల పట్ల తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అసపూర్తిగా జరుగుతున్న పనులకు బడ్జెట్ కేటా యించకపోగా ఇష్టం సారంగ వ్యవహరిస్తే ఎంతో భవిష్యత్తు ఉన్న జడ్చర్ల మున్సిపాలిటీ ఎటువైపు ప్రయాణిస్తుందని ఇటు ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చర్చించుకుంటున్న మాట కు ముగింపు ఎలా పలుకుతారో చూడాలి.
నిబంధనల మేరకే ముందుకు సాగుతున్నాం...
నియమ నిబంధన మేరకు జడ్చర్ల మున్సిపాలిటీ అభివృద్ధి వైపు ముందుకు తీ సుకుపోయేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి అందరికి సమాచా రం ఇవ్వడం జరిగింది. అభివృద్ధి వేగం గా తీసుకుపోయేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. అభివృద్ధికి ఎమ్మె ల్యే పూర్తిస్థాయిలో తోడ్పాటును అందించడంతోపాటు అవసరమైన చర్యలు తీ సుకుంటున్నారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుండానే అభివృద్ధి చేస్తున్నాం.
లక్ష్మారెడ్డి, మున్సిపల్ కమిషనర్, జడ్చర్ల, మహబూబ్ నగర్ జిల్లా






