పేదలకు మంచి చేయడమే మా సంకల్పం
- అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నాం
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్, నవంబర్ 3(విజయక్రాంతి): పేదలకు మంచి చేయడమే మాకు సంకల్పమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మ హబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ పట్టణ,గ్రామీణ మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను, వేపూరులో అక్ష యపాత్ర ఫౌండేషన్ కేంద్రం, మునిమోక్షం వేపూరులో, వేపూర్ లలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడంతోపాటు జిల్లా కేంద్రంలో చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల్లో పుట్టిన ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తోందని వారికి ఆడబిడ్డలకు భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు వివాహ సమయంలో భారం తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కు మార్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇంచార్జీ గోనెల శ్రీనివాసులు, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు శాంతన్న యాదవ్, ఖాజా పాషా, రాషెద్ ఖాన్, అంజద్, మోసిన్,ఉమర్, చిన్న, లక్ష్మణ్ నాయక్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్ కుమార్, నాగరాజు, లీడర్ రఘు , శ్యాం మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






