24 June, 2026 | 3:10 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

డొక్కా సీతమ్మపై సినిమా రావడం ఆనందకరం

26-06-2025 12:00 AM

మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతోంది ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రాన్ని టీవీ రవి నారాయణ్ దర్శకత్వంలో ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. మురళీమోహన్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్‌ను, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ.. “కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మను పొగిడారు.

సన్మానం చేస్తామని లండన్‌కు రమ్మని పిలిస్తే.. ‘నేను అక్కడికి వస్తే ఇక్కడివారి ఆకలి ఎవరు తీరుస్తారు?’ అని నిరాకరించారు. అలాంటి ఓ గొప్ప మనిషి మీద సినిమాను తీస్తుండటం ఆనందంగా ఉంది” అన్నారు.

దర్శకుడు రవి నారాయణ్ మాట్లాడుతూ.. ‘నా మొదటి హీరో మురళీమోహన్. ఈ కథను చేయాలని చెప్పిన క్షణం నుంచీ ఇప్పటివరకు ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు. ప్రముఖ నిర్మాతలు రామ సత్యనారాయణ, బెక్కెం వేణుగోపాల్, రేలంగి నరసింహారావు, చిత్రబృందం పాల్గొన్నారు.