24-02-2026 12:00:00 AM
చేవెళ్ల ఫిబ్రవరి 23(విజయక్రాంతి): చేవెళ్ల నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.100 కోట్ల చొప్పున కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ మేర కు ఐదేళ్ల కాలానికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, అత్యవసర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కొత్త పాలక వర్గాలకు సూచించారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల మున్సిపాలిటీలోకి కేజీఆర్ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్యే కాలె యాదయ్య అధ్యక్షతన నిర్వహించిన చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమానికి ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎమ్మె ల్సీ యాదవ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూమున్సిపాలి టీల్లో గెలుపు సాధించడం కార్యకర్తల కష్టం, ఐక్యతకు నిదర్శనమని అన్నారు. టికెట్ రాకపోయినా పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయ కుడు గెలిచిన వారితో సమానమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 86 శాతం శాతం మున్సి పాలిటీలు గెలిచామని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని కనబరచాలని పిలుపునిచ్చారు.
బీఆర్‌ఎస్, బీజేపీ అనైతిక ఒప్పందాలు చేసుకున్నాయని, బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ లో బీజేపీ బీ ఫామ్స్ ఇస్తున్నారని వికారాబాద్ జిల్లాలో ఓ బీజేపీ నాయకుడు బయటికి వచ్చి చెప్పాడని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఒప్పం దాలు చేసుకున్నారని, అయినప్పటికీ ప్రజ లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని స్పష్టం చేశారు. కౌన్సిలర్లుగా గెలిచిన వారిపై బాధ్య త పెరిగిందని, ప్రజలకు అందుబాటులో ఉండి పారదర్శకంగా పనిచేస్తే అవసరమైన నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాదన్ కుమార్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులని, జిల్లా అభివృద్ధి, సంక్షేమం విషయంలో వారికి పూర్తి అవగాహన ఉందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్ రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ సమతా వెంకట్ రెడ్డి, వైస్ చైర్మన్ రా ములు గౌడ్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆగిరెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ సున్నపు వసంతం, మెంబర్ షాబాద్ దర్శన్, మాజీ జడ్పీటీసీలు మంగళి బాలరాజు, కాలె శ్రీకాంత్, పీఏసీఎస్ మాజీ చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి, మండల, మున్సిపల్ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాయకులు మంగళి బాలరాజు, పడాల ప్రభాకర్, గోనె శ్రీనివాస్ రెడ్డి, టేకుల పల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.