17 June, 2026 | 3:41 AM

బాగా చదివి ఉన్నత ఉద్యోగం సాధించాలి

17-06-2026 02:38 AM

నిర్మల్ జూన్ 16 ( విజయ క్రాంతి): ఏం పిల్లలు మీ స్కూలు ఎలా ఉంది, అన్ని సౌకర్యాలు ఉన్నాయా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, కేజీబీవీలో నర్సాపూర్ కు మంచి పేరు ఉంది, ఇక్కడ సీటు కోసం పోటీ ఉంటుంది, మీరంతా కష్టపడి చదవండి, నాలా పెద్ద ఉద్యోగం సాధించాలి, విద్యార్థులను జిల్లా కలెక్టర్ భవే ష్ష్ మిశ్రా ప్రోత్సహించారు, 

మంగళవారం నరసాపూర్ జి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ కేజీబీవీ పాఠశాలకు చదువుల్లో మంచి పేరు ఉందని అదే స్ఫూర్తిని కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. పిల్లలకు పుస్తకాలు స్కూల్ డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, ఎస్ ఓ వీణ స్థానిక అధికారులు ఉన్నారు. 

ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ 

నర్సాపూర్ జి మండల కేంద్రంలో గల సామాజిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. ఆస్పత్రికి వెళ్లిన ఆయన రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. మందుల కొరతపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు