11 May, 2026 | 12:42 AM

మత్తు వదిలితేనే మంచిది!

10-05-2024 12:10 AM

ఉడుకు రక్తం, ఉక్కు నరాలతో ఉరకలెత్తే యువతరమే ఏ దేశానికైనా సహజ వనరులను మించిన బలమైన సంపద. యువత ఆరోగ్యంగా, పటిష్ఠంగా సక్రమమైన మార్గం లో ఉన్నప్పుడు ఆ దేశం అభివృద్ధిని సాధించడం చాలా సులభం. మన దేశంతోపాటు ప్రపంచంలో అభివృద్ధి చెందిన, చెందుతు న్న దేశాలను తీసుకుంటే ఎక్కడైనా యువతదే కీలకపాత్ర. దేశంలో అద్భుతాలను సృష్టించాల్సిన ఈ యువశక్తి ఇప్పుడు మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్నది.

విద్యార్థి దశలో చెడు వ్యసనాల బారిన పడి యువకులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. కాలేజీ లు, విశ్వవిద్యాలయాల్లో విచ్చలవిడిగా దొరుకుతున్న డ్రగ్స్, పెరిగిపోతున్న మద్యం అల వాటు, వారి జీవిత గమ్యాన్ని పతనం వైపు నడిపిస్తున్నాయి. ఈమధ్య హైస్కూల్ స్థాయి విద్యార్థులు కూడా గంజాయికి అలవాటు పడ్డారని వస్తున్న వార్తలను చూస్తే భావిభారత పౌరులుగా ఎదగాల్సిన యువతరం ఎటువైపు వెళుతుందో అన్న ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలో ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం ‘డ్రగ్స్’. మరింత ఆం దోళన కలిగించే విషయం ఏమిటంటే, వీటికి అధిక శాతం మంది విద్యార్థులు బానిసలు గా మారుతుండటం. సరదాగా స్నేహితులతో మొదలుపెట్టిన ఈ అలవాటు చివరకు వారిని బానిసలుగా మార్చి, చివరకు జీవితాన్ని కోల్పోయే దీనిస్థితికి తెస్తున్నది.

డ్రగ్స్‌ను మొదట తక్కువ ధరకు ఇచ్చి, అలవాటైన తర్వాత ఎక్కువ ధరలకు అమ్మడంతో వాటిని కొనే స్థోమత లేక దొంగత నాలకు అలవాటు పడుతున్న వారూ వున్నా రు. ఇలా అక్రమ మార్గంలో డబ్బులు సం పాదించడానికి ప్రయత్నించి కటకటాల పాలవుతున్నారు కొందరు యువకులు. కొన్నేళ్ల క్రితం వరకూ హైదరాబాద్ లాంటి నగరా లు, కొన్ని విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమైన ఈ డ్రగ్స్ భూతం ఇప్పుడు పట్నం నుండి పల్లెలకు శరవేగంగా విస్తరించింది. సంపన్నులు, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారికి, విశ్వవిద్యాలయాల్లో కొంతమందికి పరిమితమైన ఈ డ్రగ్ సంస్కృతి, గ్రామాల్లోని పాఠశాలల విద్యార్థుల వరకు  రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గ్రామాల్లో కొందరు విద్యార్థులు గంజాయి సేవిస్తూ, పోలీసులకు చిక్కిన వార్తలూ చదివాం.

పిల్లలపట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా ముఖ్యం. కొందరు వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగానే విద్యార్థులకు డ్రగ్స్ అలవాటు చేయి స్తుండగా, ఇటువంటి వాళ్ల వలలో చిక్కుకోకుండా యువత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు పిల్లలను గమనిస్తూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక విద్యార్థి ఇంటినుంచి బయటకు వెళ్లిన దగ్గర్నుంచి స్కూల్లో ఏం చేస్తున్నాడు? స్నేహితులు ఎలాంటివారు? బయ ట ఎక్కడెక్కడికి వెళుతున్నాడు? వంటి విషయాలను ఒక కంట కనిపెడుతూ ఉండా లి. పిల్లలపై నమ్మకం ఉంచడం ముఖ్యమే కానీ, పూర్తిగా పర్యవేక్షణ లేకుండా ఉండటం మంచిది కాదు. ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులు ఇద్దరూ వాళ్లవాళ్ల పనుల్లో బిజీ అవడంతో పిల్లలను పట్టించుకొనే తీరిక వుం డటం లేదు. విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడి, చాలామంది విద్యార్థులు మరింత ఆనందం కోసం డ్రగ్స్, మద్యపా నం, గంజాయి  వంటివాటికి బానిసలుగా మారుతున్నట్టు తెలుస్తున్నది.

 గడప రఘుపతిరావు

వ్యాసకర్త సెల్: 9963499282