15 June, 2026 | 1:10 PM

Breaking News

మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •   నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్   •   విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులు   •   ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకం.. విద్యార్థులకు టిఫిన్ తినిపించిన మంత్రి పొన్నం   •   విద్యుత్ షాక్ తో రైతు మృతి   •   ప్రైవేటీకరణపై.. కొత్త గనుల కోసం కొట్లాడుదాం   •   యుద్ధం ముగిసింది.. ఇంజిన్లు స్టార్ట్ చేయండి.. ట్రంప్ కీలక ప్రకటన   •   మైనర్ల రక్షణలో మహిళా పోలీసుల పాత్ర అత్యంత కీలకం   •  

స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ జిల్లాలో నిర్వహించడం అభినందనీయం

15-11-2025 10:39 PM

మునిప‌ల్లి (విజయక్రాంతి): స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ జిల్లాలో నిర్వహించడం అభినందనీయమని సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండ‌ల ప‌రిధిలోని లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న స్కౌట్స్, గైడ్స్ శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వహిస్తున్న సందర్భంగా శనివారం నాడు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హాజరై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ భారత్‌లో యువతకు క్రమశిక్షణ, సామాజిక సేవ, వ్యక్తిత్వ వికాసం కోసం ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.12లక్షలు మంజూరు చేసినట్టు తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మం రాష్ట్రంలోనే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల సొసైటీ పాఠశాల, కళాశాల ఎంపిక చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అలాగే విద్యార్థులు క్ర‌మ శిక్ష‌ణతో క‌లిసి మెల‌సి ఉన్న‌ప్పుడే ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎదుగుతార‌న్నారు. ముందుగా డీఈఓ వెంకటేశ్వర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కమిషనర్ మోహన్ రావు, లీడర్ ట్రైనింగ్ గైడ్ భరతమాత, హిమాలయ హుడ్ బ్యాడ్జి సాల్మన్, అసిస్టెంట్ లీడర్ ర‌వి కిరణ్, సంగారెడ్డి జిల్లా కార్యదర్శి మాధవరెడ్డి, ఎంఈఓ భీమ్ సింగ్, లింగంప‌ల్లి గురుకుల పాఠ‌శాల ప్రిన్సిపాల్ సురభి చైతన్య, ఉపాధ్యాయులు ఆంజనేయులు, సుందర్ రావు, చంద్రశేఖర్ గౌడ్, ఉపాధ్యాయులు, జిల్లాలోని పిఈటిలు, పీడీలు  తదితరులు పాల్గొన్నారు.