16 April, 2026 | 1:03 AM

డిజిటల్ యుగంలో పుస్తకాలకు ఆదరణ పెరగడం ఆనందదాయకం

04-11-2025 01:40 AM

-డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ 

-జస్టిస్ సుదర్శన్ రెడ్డి 

ఖైరతాబాద్, నవంబర్ ౩ (విజయక్రాం తి): డిజిటల్ యుగమని పేర్కొంటున్న ప్రస్తు త కాలంలో పుస్తకాల ప్రచురణ, పాఠకులు పెరగటం ఆనందదాయకమని హైదరాబాద్ బుక్ ఫెయిర్(హెచ్‌బిఎఫ్) గౌరవ సలహాదారులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సుదర్శన్ రెడ్డి, హెచ్‌ఎఫ్ సలహాదారులు టిజెఎస్ అధినేత  ఎమ్మెల్సీ కోదండరామ్, పూర్వ సంపాదకులు కె.రామచంద్రమూర్తిలతో కలిసి డిసెంబర్ 19 నుంచి 29 వరకు జరిగే 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోగోను నిర్వాహకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జస్టిస్  సుదర్శన్ రెడ్డి మాట్లాడు తూ.. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బుక్ ఫెయిర్ సందర్శకులకు, స్టాల్ నిర్వాహకులకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పా ట్లు చేస్తున్నారన్నారు. హెచ్‌ఐఎఫ్ అధ్యక్షులు డా.యాకుబ్, కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ మా ట్లాడుతూ బుక్ ఫెయిర్‌లో పాల్గొనేందుకు స్టాళ్ల నిర్వాహకుల నుంచి ఈ నెల 30 వరకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లి, ఎంహెచ్‌ఆర్ భవన్లోలోని బుక్ ఫెయిర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయవచ్చన్నారు. హెచ్‌ఐఎఫ్ కోశాధికారి పి నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యులు బి.శోభన్ బాబు, కె. సురేశ్ ఎ. జనార్దన్ గుప్త యూశ్రీనివాస్. టి సాంబశివరావ. స్వరాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.