21-01-2026 12:00:00 AM
ఎంపీ మల్లు రవి
అలంపూర్ జనవరి 20: అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలకు టెంకాయలు కొట్టే సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను అడ్డుకుని టెంకాయల పంచిని లాక్కోవడం ఎమ్మెల్యే విజయుడుకు తగదని ఎంపీ మల్లు రవి అన్నారు.మంగళవారం పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం ఎంపీ మల్లు రవి ప్రెస్ మీట్ లో ఈ సంఘటనపై ప్రస్తావిస్తూ ...ప్రోటోకాల్ విషయంలో నేను వ్యతిరేకిని కాను అన్నారు.ఇక్కడికి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులకి కాంగ్రెస్ పార్టీ నాయకులు టెంకాయలు కొట్టడం సహజం ఎంపీగా ప్రోటోకాల్ ఉన్న నాకే టెంకాయ ఇవ్వకుండా సంచి లాక్కోవడం ఏంటనిఎమ్మెల్యే విజయుడికి ఇది పద్ధతి కాదని చెప్పారు.
అభివృద్ధి విషయంలో పార్టీ లు చూడకూడదన్నారు. అభివృద్ధికి నేను అన్ని పార్టీ నాయకులని కలుపుకుంటాను.ఎమ్మెల్యే విజయుడు ప్రవర్తన బాధాకరం అని అన్నారు. శంకుస్థాపనకు ఎంపీ అయినా నాకే టెంకాయ ఇవ్వకుండా టెంకాయల సంచిని లాక్కోవడం ఏంటని నేను ఎంపీ ని కాదా అని అభివృద్ధి పనులలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండొద్దు అన్నట్లు ప్రవర్తించడం ఏంటని ఎమ్మెల్యేను ప్రశ్నించాడు.నేను రియాక్ట్ అయ్యే పరిస్థితులు తీసుకురావద్దంటూ మీడియా సమావేశంలో ఆయన హెచ్చరించారు.