12 March, 2026 | 6:49 AM

కిట్స్ కళాశాలలో నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ

12-03-2026 12:04 AM

కోదాడ, మార్చి 11 : కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి ఆధ్వర్యంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ , రెండవ సంవత్సరం చదువు తున్న విద్యార్థినులకు టాస్క్ నిపుణులు  భాను ప్రదీప్ ఆధ్వర్యంలో బుధవారం శిక్షణ తరగతులు నిర్వహించారు.

ఈ శిక్షణ తరగతులలో  విద్యార్థినులకు పైథాన్ ప్రోగ్రాం మీద  విద్యార్థి నులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచం లో విద్యార్థినులు వివిధ నైపుణ్యాలను  పెంపొందించుకున్నప్పుడు మాత్రమే ఉన్నత ఉపాధి అవకాశాలు అందుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, విభగాదిపతి స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.