అయ్యో పాపం!
14-05-2024 12:00 AM
ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల సిబ్బంది ఒకరు పాముకాటుకు గురి కావడం బాధాకరం. భీంపూర్ మండలం అందర్‌బంద్ పోలింగ్ కేంద్రంలో విధి నిర్వహణకు వచ్చిన ఉపాధ్యాయుడు బహిర్భూమికి వెళ్లిన వేళ ఈ ప్రమాదం జరిగినట్లు వార్త వచ్చింది. ఆయన క్షేమంగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. అనేక గ్రామాలలో ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచి పోవడం వల్ల ప్రజలు ఇలా అనేక ఇబ్బందులు పడుతున్నారు.
సుధాకర్‌రావు, నిర్మల్






