నిమ్మకాయ చుట్టూ అల్లుకున్న కథ
ఆధునిక కాలంలోనూ జడలు విప్పుతున్న మూఢనమ్మకాలను ఎండగడుతూ, ఉత్కంఠ రేకెత్తించే ఓ ఆసక్తికర కథనంతో తెలుగు తెరపైకి రాబోతున్న చిత్రం ‘నిమ్మకాయ.. నీకెం దుకు భయం’. రాజేశ్ భూపతి, స్వప్నరాజ్, అబిత హీరోహీరోయిన్లు. సుమన్, ఆమని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బీవీసీ ఫిలమ్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు. ఈ చిత్రం బుధ వారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి పీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా క్లాప్ కొట్టారు. లయన్ వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్‌కు టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ.. “చిన్న నిర్మాతలకు ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలు తీసుకురావాలి” అన్నారు. “కథలో ఎక్కువ భాగం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఉంటుంది. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం” అని దర్శకుడు రోశిరెడ్డి తెలిపారు.






