15 April, 2026 | 5:17 AM

మహనీయుల వల్లే అణగారిన వర్గాల్లో వెలుగులు

15-04-2026 01:39 AM

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

సిద్దిపేట, ఏప్రిల్ 14(విజయక్రాంతి): అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిరావు ఫూలే వంటి మహానీయుల వల్లే అణగారిన వర్గాలలో వెలుగులు నిండాయని, ఈ ముగ్గురూ దేశానికి దిక్సూచిలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం సిద్దిపేట జిల్లా మందపల్లిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి మందకృష్ణ ఆవిష్కరించారు.

జగ్జీవన్ రామ్, అంబేద్కర్ అన్నదమ్ములలాగా కలిసి పనిచేశారని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మార్పీఎస్ మద్దతుగా నిలిచిందన్నారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ పోరాట పటిమ ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 78 ఏండ్లు అవుతున్న ఇంకా దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్య క్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.