25 March, 2026 | 3:29 AM

ఘనంగా వికలాంగుల దినోత్సవం..

03-12-2024 06:49 PM

ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి...

కాప్రా: కాప్రా పట్టణ వికలాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో హెచ్ బీ కాలనీ డివిజన్ ఫేజ్-1 గ్రౌండ్ లో నిర్వహించిన ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంగవైకల్యం మనోస్థైర్యానికి అడ్డు కాదని ఎంతో గొప్ప గొప్ప విజయాలు సాధించి ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించుకుని ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిలో దివ్యాంగులది ప్రత్యేక, విశిష్టమైన స్థానం ఉన్నారు, మనిషి అనుకోవాలి గాని ఏదైనా సాధించగలరు అనే పట్టుదల మనస్తైర్యం ఆత్మవిశ్వాసం వికలాంగులకు ఉంటుందని, ఆత్మవిశ్వాసం సాధారణ మనుషులమైన మనకు ఎంతో ఆదర్శప్రాయమని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో వికలాంగులకు ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ గతంలో 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ 4016 రూపాయలు చేసి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచి వారి కాళ్ళపైన వారు నిలబడి జీవన విధానాన్ని మెరుగుపరుచుకునే విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని అలాగే ప్రభుత్వ పథకాల సంబంధించిన ఏ పథకమైన దివ్యాంగులకు ముఖ్య పాత్ర ముందు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

కేసిఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకంలో కూడా వికలాంగులు రెండు మూడు, ఆపై అంతస్తులకు చేరుకోవడం చాలా ఇబ్బందికరమైన విషయంగా పరిగణించి మొదటి అంతస్తులో వారికి ప్రాధాన్యత ఇచ్చి ఇళ్ల పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కాప్ర పట్టణ వికలాంగుల సమాఖ్య వారు అందిస్తున్న రెండు ట్రై సైకిల్, రెండు వీల్ చైర్స్, రెండు ట్రైపాడ్, 200 మందికి దుప్పట్లు, ప్రత్యేకంగా వికలాంగుల కోసం బ్యాంకు నుండి 12 లక్షల రూపాయలు మూడు గ్రూపులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, వికాసం రిసోర్స్ పర్సన్స్, రిసోర్స్ పర్సన్స్, నాయకులు గుమ్మడి జంపాల్ రెడ్డి, దండెం నరేందర్, కాప్రా పట్టణ వికలాంగుల సమాఖ్య అధ్యక్షులు ఎండి బాబు జాని, ఉపాధ్యక్షులు లక్ష్మి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, ఆంజనేయులు, పాండు నాయక్, నరసింహ, కమిటీ సభ్యులు మల్లారెడ్డి, సుజాత, నాగరాణి, మనీషా, కాప్రా పట్టణ వికలాంగులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గోన్నారు.