22 March, 2026 | 12:41 PM

‘ప్రేయసిరావే’ స్థాయిలో హిట్ కావాలి

22-03-2026 12:00 AM

రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉప శీర్షిక ‘అలా మొదలైంది’. మహేశ్ చంద్ర దర్శకత్వంలో దుండిగళ్ల బాలకృష్ణ, ఆకుల సురేశ్ పటేల్, ఎఫ్‌ఎం మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ‘ప్రేయసి రావే’ టీమ్ హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీరాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సందర్భంగా నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ప్రేయసి రావే’ కంటే ముందు నేను చేసిన కొన్ని చిత్రాలు సరిగ్గా ఆడలేదు. చంద్ర మహేశ్ నాతో తీసిన ‘ప్రేయసి రావే’ అద్భుతమైన విజయం సాధించింది. ఈ ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మూవీ మా ‘ప్రేయసిరావే’ రేంజ్‌లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నా రు. ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మహేశ్‌చంద్రతోపాటు అతిథులు, చిత్రబృందం కూడా మాట్లాడారు.