24 June, 2026 | 10:58 PM

దిగివచ్చిన బంగారం

09-06-2024 12:05 AM

హైదరాబాద్, జూన్ 8: అంతర్జాతీయ మార్కెట్లో  బంగారం ధర అనూహ్యంగా పతనమయిన ప్రభావంతో స్థానికంగా పుత్తడి భారీగా దిగివచ్చింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో  శనివారం ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,080 తగ్గి రూ.71,670 వద్దకు దిగింది. 22 క్యారట్ల పుత్తడి తులం ధర రూ.1,900 తగ్గి రూ.65,700 స్థాయికి చేరింది. ప్రపంచ మార్కెట్లో  ఔన్సు పుత్తడి ధర ఒక్కసారిగా 83 డాలర్లకుపైగా పతనమై 2,293 డాలర్లస్థాయికి పడిపోయింది. యూఎస్ ఆర్థిక వ్యవస్థ బలాన్ని సూచిస్తూ అక్కడ జాబ్స్ డేటా వెలువడటంతో సమీప భవిష్యత్తులో అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలే ఈ పతనానికి కారణం.  ఈ ట్రెండ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయ మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో 10 గ్రాముల పసిడి రూ.1,800 మేర తగ్గి రూ.71,340 స్థాయికి క్షీణించింది. 

రూ.4,500 తగ్గిన వెండి

ప్రపంచ మార్కెట్లో పుత్తడి బాటనే వెండి అనుసరించింది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఒక్కసారిగా రూ.4,500 క్షీణించి రూ. 96,000 వద్దకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహం ఔన్సు ధర 6 శాతంపైగా క్షీణించి 29 డాలర్ల సమీపానికి చేరింది.