మైత్రి కుదిరినట్టేనా!
దక్షిణ కొరియాలోని బుసాన్ విమానాశ్రయంలో గురువారం డొ నాల్డ్ ట్రంప్ పింగ్ మధ్య జరిగిన సమావేశం, అమెరికా, చైనాల మధ్య సంబంధాన్ని తిరిగి బలోపేతం చేసే దిశగా అడుగులు పడు తున్నాయనిపిస్తున్నది. ఇద్దరి మధ్య సానుకూల వాతావరణంలోనే చర్చ లు జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదిరే అవకాశముందన్నారు.
ఈ నేపథ్యంలో ఫెంట్‌నిల్ పేరిట చైనాపై వి ధించిన 20 శాతం సుంకాన్ని పది శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అలాగే చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల రవాణాకు ఎ టువంటి ఇబ్బంది ఉండదని ట్రంప్ పేర్కొనడంతో, చైనాకు ఊరట లభించినట్లయింది. గతంలో ఇదే అరుదైన ఖనిజాల విషయంలో ఆగ్రహం చెందిన ట్రంప్ చైనాపై 100 శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరికలకు దిగిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఇరు దేశాలు సఖ్యతగా కనిపిస్తున్నప్పటికీ మళ్లీ కయ్యానికి కాలు దువ్వే అవకాశాన్ని కొట్టిపారేయలేం. గతేడాది ఇదే దక్షిణ కొరియా వేదికగా జరిగిన జీ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ట్రంప్.. జిన్ పింగ్‌పై పొగడ్తలు కురిపించిన విషయం మరువొద్దు. కానీ ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఎప్పుడూ సఖ్యత కనిపించలేదు. తాజాగా ట్రంప్ జిన్ పింగ్‌తో చర్చలు జరపడం వెనుక పెద్ద మతలబే ఉందనిపిస్తుంది.
రష్యా మధ్య యుద్ధాన్ని ఆపేందుకు జిన్ పింగ్ సహకరిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. శాంతి కోరుకోవడంలో తప్పు లేదు కాబట్టి ఇది నిజమైతే ట్రంప్ ప్రయత్నాలు ఫలించినట్లే. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహార శైలి ట్రంప్‌కు బాగా తెలుసు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో ట్రంప్ పలుమార్లు పుతిన్‌తో చర్చించినప్పటికీ అవి సఫలం కాలేదు.
పైగా పుతిన్ నమ్మదగిన వ్యక్తి కాదు కాబట్టే ఇవాళ జిన్ పింగ్‌తో సఖ్యతగా మెలిగేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. మంచి దోస్తీ కలిగిన రష్యా, చైనాలు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులు. అందుకే ఉన్నపళంగా ట్రంప్ తన స్వరం మార్చుకొని జిన్ పింగ్‌కు దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యా, చైనా మధ్య సంబంధాలను కూడా వ్యూహాత్మకంగా చీల్చేందుకు ఇది ఉపయోగపడనుంది.
అంతేకాదు జిన్ పింగ్‌తో భేటీని ట్రంప్.. జీ2 శిఖరాగ్ర సమావేశంగా ఉదహరించారు. ఇది చైనాను సంతోషపెట్టే అంశం. ఎందుకంటే అగ్రరాజ్యానికి తాము ఏ మాత్రం తీసిపోమని, ప్రపంచం మొత్తం అమెరికాతో సమానంగా తమను పరిగణించాలని చైనా బలంగా కోరుకుంటుంది. అమెరికాకు బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాను జీ అభివర్ణించారు. ఈ సమయంలో అమెరికాతో స్నేహంగా మెలిగిన చైనా భారత్‌పై బెదిరింపు విధానాన్ని ఆవలంబించింది.
తాజాగా ట్రంప్, జిన్ పింగ్ కలయిక వల్ల భారత్‌పై మళ్లీ చైనా ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం లేకపోలేదు. అయినప్పటికీ ట్రం ప్‌ను తక్కువ అంచనా వేయలేం. జిన్ పింగ్‌తో సమావేశానికి ముందే రష్యా, చైనాలు అణ్వాయుద పరీక్షల్లో వేగవంతమైన అడుగులు వేస్తున్నాయన్న అక్కసుతో తమతో సమానంగా ఉండేందుకు అవకాశమివ్వకూడ దన్న ఉద్దేశంతో అమెరికా కూడా అణ్వాయుద పరీక్షలను ప్రారంభిస్తుందని తెలిపారు. ఇప్పటికైతే చైనా అమెరికాతో సఖ్యతగా ఉంటుందని చెప్ప లేం కానీ సమస్యల పరిష్కారానికి సంబంధించి ఇరువురి మధ్య ప్రాథమిక ఏకాభిప్రాయం మాత్రం కుదిరిందని చెప్పొచ్చు.






