14 April, 2026 | 9:02 PM

కులగణనతో సామాజిక న్యాయం

31-10-2025 12:00 AM

నేదునూరి కనకయ్య :

జనగణన ప్రభుత్వ అభివృధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు దిక్సూచిగా పనిచేస్తుంది. ప్రజాస్వామ్య దేశాల్లో  సామాన్యుని సాధికారిత, యువజ న సాధికారిత, మహిళా సాధికారిత సాధనకు జనగణన కీలకమైన సమాచారాన్ని సమకూరుస్తుంది. భారత దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బృహత్తర కార్యక్రమమైన ‘జనగణన’ను నిర్వహిస్తారు. 2021లో జరగాల్సిన జనగణన పదే పదే వాయిదా పడుతూ వస్తోంది.

దీనికి తోడు కొవిడ్ మహమ్మారి తోడవ్వడంతో ఎప్పు డో జరగాల్సిన జనగణన భారత్‌లో వాయిదాల పర్వం పేరుతో మరుగున పడు తూ వస్తుంది. అయితే అమెరికా, చైనా, బ్రిటన్, బంగ్లాదేశ్,  నేపాల్ లాంటి దేశాలు మాత్రం కొవిడ్ మహమ్మారికి భయపడకుండా తమ జనగణన కార్యక్రమాన్ని పూ ర్తి చేశాయి.

అంతేకాదు జనగణన ప్రక్రియ కు తగ్గట్టుగా అభివృధి ప్రణాళికలను అ మలు చేస్తూ ముందుకు సాగుతున్నా యి. మరి భారత్‌లో చేపట్టాల్సిన జనగణన వాయిదాల పర్వం కొనసాగుతుండడంపై స్వచ్చంధ సంస్థలు, పౌర సమాజం ఆందో ళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా జనగణనను పూర్తి చేయాలని తెస్తున్న ఒత్తిళ్ల ను కేంద్రం పెడచెవిన పెట్టడం శోచనీయం.

పోరాటాలు వృథా

‘మేమెంతో ఎంతో.. మా వాటా అంత’ అన్న  నినాదంతో  బీసీ వర్గాలు చేస్తున్న పోరాటాలు దేశ వ్యాప్తంగా రాజ్యాదికారంలో బలహీన వర్గాల వాటా కోసం చే స్తున్న పోరాటాలు,ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగి సే దాకా  వెనకబడిన వర్గాల కుల గణన వాయిదా వేయాలని ప్రభుత్వం భావించడమే  జనగణన అసాధారణ జాప్యానికి కారణమనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.

కులగణన చేయకపోవడం వల్ల జనగణన ఆలస్యమవుతుందని సా మాజిక రాజకీయ వేత్తలు తమ అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు. 78 సంవత్సరాల స్వతంత్ర భారత్‌లో ఇప్పటివరకు  జరిగిన సంక్షేమాభివృద్ధికి సంబంధించి అన్ని వర్గా ల ప్రజలకు సరైన రీతిలో, ఆశించిన స్థా యిలో అభివృద్ధి ఫలాలు సమకూరదలేదనే అంశాలు బయటపడతాయన్న ఆం దోళనే జనగణన వాయిదాకు కారణం కా వొచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వం జనగణన కార్య క్రమాన్ని వాయిదా వేయడం వల్ల  దేశం లో పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, వలసలు, ఆకలి చావులు, లింగవి వక్ష, బాలకార్మికుల వ్యవస్థ, గ్రామీణ పట్టణాల మధ్య వ్యత్యాసాలు, విద్యా, వైద్య సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు, ప్రాంతీయ అసమానతల వ్యాప్తిని తీవ్రతను అంచనా వేయలేక పోవడం వల్ల దేశ అభివృద్ధి మందగిస్తూ వస్తున్నది.

దెబ్బతిన్న లింగ నిష్పత్తి

జనగణన సమాచారం ఆధారంగా కేం ద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు బడ్జెట్  నిధులు, ఇ తర వనరుల కేటాయింపు నియోజక వర్గా ల పద్దుల నిర్ణయంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు రాజకీయ  ప్రాతినిధ్యం, అభివృధి ప్రణాళికల రూపకల్పన, ఆర్థిక వికేంద్రీకరణ, స్థానిక సంస్థల సాధికారిత,  సహజవనరుల వినియోగం కేటాయింపులకు సంబంధించిన పంపిణీ ఏ విధంగా జరుగుతుందనే సమాచారం క్లుప్తంగా తెలుస్తుంది.

గ్రామ, పట్టణ, మున్సిపల్ వార్డ్ స్థాయిలో విద్య, వైద్య, తాగు నీరు, రవా ణా, రోడ్లు మౌలిక సదుపాయాలకు సం బంధించిన సమాచారం జనగణన ద్వారానే తెలుసుకునే అవకాశముంటుం ది. 1990 సంవత్సరంలో భారత్‌లో లింగ నిష్పత్తి దెబ్బతింటుందని జనగణన ద్వారా నే తెలిసింది. అప్పట్లో తల్లి గర్భంలో పెరిగేది ఆడ పిల్ల అని తెలియగానే బ్రూణ హ త్యలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నా యి.

దీనివల్లే 1990 నుంచి 2000వ సంవత్సరం మధ్య స్త్రీ, పురుష లింగ నిష్పత్తిలో అసమానతలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆడ శిశువుల హననాన్ని నిషేధించడంతో పాటు ‘భేటీ బచావో భేటీ పడావో’ వంటి కార్యక్రమాలను తీసుకొచ్చింది.

దేశంలో ఆర్థి కంగా, పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాల గుర్తింపు, ‘స్వచ్ఛ భారత్’ లాంటి కార్యక్రమాలకు జనగణన ప్రేరణగా నిలిచింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ పంపి ణీ వ్యవస్థకు పేదలకు ఉచిత ఆహార పం పిణీ, గ్యాస్  కనెక్షన్, ఆహార భద్రత చట్టానికి జనగణన వల్ల వచ్చిన సమచారం ఎంతగానో ఉపయోగపడిందన్న విషయం గ్రహించాలి.

90 ఏళ్ల నాటి సమాచారమే

జనగణన లాగే కుల గణన ఒక ప్రజాస్వామిక అవసరం. కులగణతో సామాజిక న్యాయం, పంపిణీ న్యాయం సిద్ధిస్తుంది. భారత్‌దేశ జనగణన బ్రిటిష్ వారు పన్ను ల వసూలు కొరకు 1866లో చేశారు. బ్రిటిష్ వారు 1931 వరకు కులాల వారి జనగణన పద్ధతిని కొనసాగించారు. జనాభాలో కుల గణన చివరిసారి బ్రిటిష్ హ యంలోనే జరిగింది. నేటి వరకు భారత ప్ర భుత్వం దగ్గర బ్రిటిష్ వారు చేసిన కుల గణన సమాచారమే అందుబాటులో ఉం డడంతో వెనుకబడిన కులాల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

దేశంలోని వివిధ రకాల సామాజిక కులాల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, రాజ్యాంగ నిర్మాణ అనంతరం అమలు అవుతున్న రిజర్వేషన్స్.. గత 90 యేళ్ల నాటి కులాల సమా చార ప్రాతిపదికనే కావడం ఆలోచించాల్సిన విషయం. హరిజనులు, గిరిజనులకు వారి జనాభా దమాషా ఆధారంగా రిజర్వేషన్స్ అమలు చేయాలన్న రాజ్యాంగ నియ మావళి మాత్రమే అమల్లో ఉంది.

1931 నాటి జనగణన ప్రకారం బీసీ కులాల జనాభా 62 శాతం ఉన్నట్లు మండల్ కమిషన్ తమ నివేదికలో పేర్కొంది. జనగణన ద్వార దేశ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులు, మానవాభివృద్ధికి.. దానికి అమలవుతున్న వనరులకు మధ్య సమతుల్యత ఏర్పడే అవకాశముంది.

దాటవేత ధోరణి

దేశ వ్యాప్తంగా జనగణనలో కులగణన చేయాలన్న డిమాండ్  ఊపందుకుంది. కుల గణన చేపట్టడానికి జనగణన అంశా ల్లో కులగణన అంశాన్ని అధనంగా చేర్చితే సరిపోతుంది. అనేక పార్టీలు, సామాజిక కుల సంఘాలు.. కుల ఆధారిత జనగణన కోసం ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. 2011 జ నాభా లెక్కల సందర్భంగా కులగణన చే యాలనే బలమైన డిమాండ్ కారణంగా.. 2018లో కులగణన చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది.

అయితే సుప్రీంకోర్టు ఎదుట మాత్రం కులగణన సమాచా రాన్ని ఇవ్వలేమని, కులగణన వివరాలు బయటకు చెప్పడం వల్ల పాలనా పరమైన చిక్కులు ఉంటాయని కేంద్రం పేర్కొనడం గమనార్హం. ఇది సున్నితమైన అంశమం టూ కులగణన ప్రక్రియను పక్కన బెట్టేసింది. అయితే కులగణన ద్వారా దేశంలో కులతత్వం పెరుగుతుందని, కుల వ్యవస్థ సుస్థిరతకు దోహద పడుతుందనే భావన కలిగే చాన్స్ ఉందంటూ సాకులు చెబుతూ వచ్చింది.

కేంద్ర ప్రభుత్వ వైఖరి బీసీ వర్గాలకు ఆశనిపాతంగా పరిణమించింది. సా ర్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఆయా నియోజకవర్గాల్లో కులం ఆధారం గా జనాభా, కుల ఓటర్ల ఆధారంగా అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తున్నారు. మరి ఈ సమయంలో కులతత్వం అడ్డురాదా అ న్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కులగణనచేస్తేనే కుల వ్యవస్థ బలపడుతుందా? రాజ కీయ పార్టీలు అవలంభిచే దంద్వ వైఖరి స రైనది కాదని చాలా మంది అభిప్రాయం.

కులాల ఆధారంగా జనాభా లెక్కలు జరిగితే రిజర్వేషన్ పరిధి 50 శాతం పైగా పెంచాలన్న డిమాండ్ పెరిగిపోతుంది. విద్య, వైద్య, రాజకీయ రంగాల్లో  మరింత ప్రాతినిథ్యం పెంచాలన్న డిమాండ్ పెరుగుతుందన్న అక్కసు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. 2020 ప్రకారం దేశ జనాభాలో 10 శాతం దగ్గర 74.3 శాతం సంపద, 40 శాతం జనాభా దగ్గర 22.9 శాతం..

మరో 50 శాతం జనాభాకు కేవలం 2.8 శాతం సంపద ఉందని తెలిపింది. జనగణనలో కులగణన చేయడం వల్ల రాజ్యాంగ లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక, ఆర్థిక పంపిణీ న్యాయం సిద్ధించి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. సకాలంలో జనగణన నిర్వహించి సమాచారా న్ని సేకరించకపోతే పేదలకు సంక్షేమ పథకాల ఫలాలు ఎండమావులయ్యే ప్రమా దం పొంచి ఉంది.

వ్యాసకర్త సెల్: 9440245771