రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..
బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి
కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): రాబోయే రోజుల లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని బిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటి వద్ద పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. కెసిఆర్ 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేసీఆర్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో వచ్చేది టిఆర్‌ఎస్ ప్రభుత్వమే నన్నారు.
కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త కష్టపడి అధికారంలోకి తీసుకొద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కౌన్సిలర్ అరకల ప్రభాకర్ యాదవ్, మాజీ కౌన్సిలర్ కుంభాల రవి యాదవ్, కౌన్సిలర్లు లోలపు శ్రీనివాస్, మామిళ్ళ లక్ష్మణ్, ఏజాజ్, మాజీ కౌన్సిలర్లు నజీరుద్దీన్, టిఆర్‌ఎస్ పట్టణ నాయకులు జెర్సీ నర్సింలు, కొత్తఇంటి శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్, హను మండ్లు, మాజీద్, షౌకత్ పాల్గొన్నారు.






