28 April, 2026 | 3:03 AM

ఘనంగా ఓయూ 109వ ఫౌండేషన్ డే

28-04-2026 12:43 AM

వీసీ సమక్షంలో స్టాన్లీ విద్యార్థినులకు బహుమతుల అందజేత

హైదరాబాద్, ఏప్రిల్ 2౭(విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ 109వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఆదివారం ఠాగూర్ ఆడిటోరియంలో  వైస్ ఛాన్సలర్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ కుమా ర్ మోలుగరం అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమంలోముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక, విశిష్ట అతిథులుగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు, రాజ్యసభ సభ్యులు, సీఎం సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, కీనోట్ స్పీకర్‌గా ప్రముఖ ఆర్థికవేత్త మోహన్ గురుస్వామి పాల్గొన్నారు.

మార్చి 6, 7 తేదీల్లో జరిగిన ఓయూ అంతర్ కళాశాల సాంస్కృతిక పోటీ లు 2025- స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, అబిడ్స్ విద్యార్థినులు రెండు బహుమతులు సాధించారు. గ్రూప్ డా న్స్ (గిరిజన) విభాగంలో డి. మానస్విని అం డ్ టీమ్ ద్వితీయ బహుమతిని, గ్రూప్ డాన్స్ (దేశభక్తి) విభాగంలో ఎస్‌ఎస్ నేహా అండ్ టీమ్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. వేడుక ల్లో భాగంగా స్టాన్లీ కళాశాల విజేత బృందాలు తమ బహుమతి గెలుచుకున్న నృత్యాలను వేదికపై ప్రదర్శించారు. 

అనంతరం వీసీ ప్రొ. కుమార్ మోలుగరం, విశిష్ట అతిథుల చేతుల మీదుగా విద్యార్థినులకు మెరిట్ సర్టిఫికెట్లు, మెమెంటోలు ప్రదానం చేశారు. కరస్పాండెంట్ కె కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ రా జు, ఏఓ రమేష్, హెచ్&ఎస్ విభాగాధిపతి డాక్టర్ జి పద్మ శ్రీ విజేత విద్యార్థినులను అభినందించారు. సాంస్కృతిక ఇన్‌చార్జి బి శ్రీలత, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ డాక్టర్ జీజే రూపశ్రీ విద్యార్థినులకు మార్గదర్శనం చేసి కార్యక్రమంలో వారి వెంట ఉన్నారు.సమన్వయకర్త డాక్టర్ ఎ మైత్రేయి కూడా సహకరించారు.