calender_icon.png 14 January, 2026 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మూడేళ్ల వరకు కేసీఆర్ కనిపించడం కష్టమే

14-01-2026 12:28:51 AM

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి

గజ్వేల్, జనవరి13: కెసిఆర్ జీతభత్యాల కోసమే గజ్వేల్ ఎమ్మెల్యే పదవిని పట్టుకొని వేలాడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం గజ్వేల్ ము న్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో రూ 18 కోట్ల వ్యయంతో అంతర్గ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన, క్యాసారంలో ఇందిరమ్మ ఇంటిని లాంఛనంగా ప్రారంభించి ఆయన మాట్లాడారు.

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అండగా నిలిచి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అందుకు భిన్నంగా బిఆర్‌ఎస్ కు ఓటు వేస్తే సిద్దిపేటలో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని, గజ్వేల్ పై సిద్దిపేట పెత్తనం ఏమిటని నిలదీశారు. ఇక్కడి సమస్యలను పదేళ్లుగా కెసిఆర్ పట్టించుకోలేదని, గజ్వేల్ కు మంజూరైన అభివృద్ధి పనులు, నిధులు సిద్ధిపేట ప్రాంతానికి తరలించినట్లు విమర్శించారు.

ముంపు బాధితుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్ తోనే సా ధ్యమన్నారు. కెసిఆర్ తొత్తులకు నిర్వాసితుల సమస్యలు, గజ్వేల్ ప్రజల ఇబ్బందులు కనిపించడం లేదన్నారు. మున్సిపల్ లో రోడ్ల అభివృద్ధికి అడిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి నిధులు మంజూరీ చేశారన్నారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు మం జూరి చేశారని, మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ఇందుకోసం తన పూర్తి సహకారం ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు అంక్షా రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అశోక్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్య క్ష కార్యదర్శిలు మొనగారి రాజు, నక్క రాములు గౌడ్, సుఖేందర్ రెడ్డి, మతిన్, రవీందర్ రెడ్డి, ఊడేం శ్రీనివాస్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, గాడిపల్లి శ్రీనివాస్, కొండల్ రెడ్డి, రమేష్ గౌడ్, లక్ష్మారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, అజ్గర్, డప్పు గణేష్, కప్ప భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.