11 May, 2026 | 6:27 AM

మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఐటీడీఏ పీవో

28-01-2025 12:49 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌(Adilabad Municipal Special Officer)గా ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా(ITDA PO Khushboo Gupta )ను ప్రభుత్వం నియమించింది. మున్సిపాలిటీల పాలకవర్గం కాల పరిమితి ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. దీంతో నేటి నుండి మున్సిపాలిటీల్లో రాజకీయా నాయకుల పాలన ముగిసి అధికారుల పాలన మొదలైంది.