13 July, 2026 | 12:59 AM

ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫారాలు రెడీ

04-05-2024 12:10 AM

న్యూఢిల్లీ, మే 3: ఆదాయపు పన్ను శాఖ ఈ పోర్టల్‌లో ఆన్‌లైన్ ఇన్‌కంట్యాక్స్ 2023 ఆర్థిక సంవత్సరానికి (2024 అసెస్‌మెంట్ సంవత్సరం) రిటర్న్ ఫారంలు 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4లను ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి తెచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులు ఈ ఫారాలు ఉపయోగించి వారి ట్యాక్స్ రిటర్న్‌లను ఫైల్ చేసుకోవచ్చు. ఇంతకు ముందుగా ఐటీ శాఖ ఈ మూడు ఫారాల ఆఫ్‌లైన్ ఎక్సెల్ యుటిలిటీస్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4, ఐటీఆర్ 6 ఆఫ్‌లైన్ జేసన్ యుటిలిటీస్‌ను సైతం విడుదల చేసింది. 2023 ఆర్థిక సంవత్సరానికి (2024 అసెస్‌మెంట్ సంవత్సరం) ఐటీ రిటర్న్‌లు సమర్పించేందుకు చివరితేదీ 2024, జూలై 31.

డేటా సరిచూసుకోండి

ఈ పోర్టల్‌లో ట్యాక్స్ పేయర్ తన అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి, ‘ఫైల్ ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్’ ఆప్షన్‌ను క్లిక్‌చేసి,  రిటర్న్‌ను పూర్తిగాఆన్‌లైన్‌లో ఫైల్ చేయవచ్చు. ట్యాక్స్ పేయర్ యాన్యువల్, ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫారం 26ఏఎస్‌లో ఉన్న డేటా అంతా ముందుగానే వారి ఫారంలో ఫిల్ అయ్యి ఉంటుంది. ఆ డేటాను పన్ను చెల్లింపుదారులు వారి ఫారం 16, ఫారం 16ఏ, ఇతర టీడీఎస్ సర్టిఫికెట్లు, బ్యాంక్ ఇంట్రస్ట్ సర్టిఫికెట్లు, సేలరీ స్లిప్స్ తదితర డాక్యుమెంట్స్ ద్వారా క్రాస్‌చెక్ చేసుకుని, రిటర్న్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. అయితే పలువురు ఉద్యోగులు వారి టీడీఎస్ సర్టిఫికెట్లును పొందడానికి జూన్ నెల చివరివరకూ వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.