3 March, 2026 | 1:31 AM

తగ్గేదేలే..!

03-03-2026 12:00 AM
  1. కొండెక్కిన చికెన్ ధరలు

కేజీ చికెన్ ధర 280 నుంచి 300

నాటు కోడి రూ.500 నుంచి రూ.600కు విక్రయాలు

పెరిగిన విక్రయాలు.. తగ్గని ధరలు.. మరింత పెరిగే అవకాశం

కూసుమంచి, మార్చి 2 (విజయక్రాంతి): చికెన్ ధరలు కొండెక్కాయి.. ఎవరు ఊహించని విధంగా ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.. కార్తీక మాసం తరువాత అమాంతంగా పెరిగిన ధరలు, ఆ తరువాత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.. కానీ ప్రస్తుతం చికెన్ ధరలు రోజుకో తరహాలో పెరుగుతూ వస్తున్నాయి. అత్యధికంగా సుముహుర్తాలు ఉండటమో, బ్రాయిలర్ కోళ్లు స్టాక్ లేకపోవడమే, ఉగాది,

శ్రీరామనవమి, రంజాన్ పండుగలు వస్తున్న తరుణం ఏమో కానీ ధరలు మాత్రం అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు, చికెన్ ప్రియులు బెంబెలెత్తుతున్నారు. వ్యాపారులు చెబుతున్నారు. ధరలు అమాంతంగా పెరుగుతున్నప్పటికి చికెన్ ప్రియులు, ప్రజలు కొనుగోలు చేస్తున్నారని, చికెన్ మాంసం విక్రయాలు తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. 

కేజీ చికెన్ ధర రూ.300

గత వారం రోజుల నుంచి బాయిలర్, జుట్టుకోళ్లు, నాటు కోళ్ల ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం బ్రాయిలర్ కోడి  కేజీ రూ.160 నుంచి రూ.180కి విక్రయాలు చేయగా, ప్రస్తుతం రూ.200 నుంచి 250 వరకు విక్రయాలు చేస్తున్నారు. అలాగే గత వారం రోజుల క్రితం స్కిన్ తో  చికెన్ కేజీ ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం ధర రూ.280 నుంచి రూ.320 వరకు విక్రయాలు చేస్తున్నారు. అలాగే గత వారం రోజుల క్రితం నాటు కోడి కేజీ రూ. 400 ధరల పలకగా, ప్రస్తుతం రూ.500 నుంచి రూ.600 వరకు విక్రయాలు చేస్తున్నారు.

అలాగే జుట్టుకోడి గత నెల రోజుల క్రితం కోడి రూ.130 నుంచి రూ.150 వరకు విక్రయాలు చేయగా, ప్రస్తుతం రూ.250 నుంచి 280 వరకు విక్రయాలు చేస్తున్నారు. అలాగే చికెన్ పకోడి, చికెన్ బిర్యాని, చికెన్ కర్రి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ధరలు పెరిగినప్పటికి ప్రజలు కొంత పెదవిరుస్తున్నప్పటికి  చికెన్ కొనుగోలు చేస్తున్నారు. 

మరింత పెరిగి అవకాశం..?

చికెన్ ధరలు రోజురోజుకు పెరుగుతుండగా, రాబోయే రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ నుంచి ఎగుమతులు లేకపోవడం, గత కొద్ది నెలల క్రితం కోళ్లు  రవాణా లేకపోవడంతో పాటు ప్రజలకు అత్యంత ఇష్టమైన హోళీ, రంజాన్, ఉగాది, శ్రీరామనవమి పండుగలు వరసగా వస్తున్న క్రమంలో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు.

అదే జరిగితే గతేడాది కంటే ఈ ఏడాది వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. వ్యాపారులు కూడా నష్టపోయే అవకాశం ఉందంటున్నారు. చూడాలి.. చికెన్ ధరలు తగ్గుముఖం పడతాయా..? పెరుగుతాయా వేచి చూడాల్సిందే మరీ.?