సత్తుపల్లి ఏరియా జనరల్ మేనేజర్ చేతుల మీదుగా ఆర్డర్స్ తీసుకున్న సత్తుపల్లి సింగరేణి ఉద్యోగులు
సత్తుపల్లి మార్చి 2 (విజయక్రాంతి ): జేవిఆర్‌ఓసి ఉద్యోగులకు కెరీర్ గ్రోత్ స్కీం ద్వారా జేవిఆర్‌ఓసీలో 16 మంది ఉద్యోగులకు (హెడ్ ఓవర్ మన్ గ్రేడ్-A నుంచి గ్రేడ్-A1 పొందిన వారు 5 మందికి , ఓవర్ మన్ గ్రేడ్-B నుంచి హెడ్ ఓవర్ మన్ గ్రేడ్-A పొందిన వారు 7 మందికి అంతేకాకుండా టైం రేటెడ్ వేకెన్సీలను ద్వారా ఐదు గురు పదోన్నతి పొందినారు. కెరీర్ గ్రోత్ స్కీం ద్వారా కిష్టారం ఓసీ లో ఒకరికి వెల్డర్ కేటగిరీ - IV నుంచి కేటగిరీ-V మరియు జె ఆర్ జె వి ఆర్ సి హెచ్ పి లో మెకానికల్ (ఫారెమన్ ) గ్రేడ్ -B నుంచి A ఒకరికి పదోన్నతులను కల్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సత్తుపల్లి ఏరియా జిఎం శ్రీ చింతల శ్రీనివాస్ చేతుల మీద ప్రమోషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది . . ఈ కార్యక్రమంలో జేవిఆర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఎన్విఆర్ ప్రహ్లాద్ జై వి ఆర్ ఓ సి, ప్రాజెక్ట్ ఇంజనీర్, శ్రీ,డి శ్రీనివాసరావు జె వి ఆర్, ఎస్ ఓ ఎం శ్రీ బి రాజేశ్వరరావు మరియు ఓ సి ఎం జి. కళ్యాణ్ రామ్ ఏ ఐ టి యూ సి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ సుధాకర్ గారు, ఐ ఎన్ టి సి, వైస్ ప్రెసిడెంట్, శ్రీ బి కోటేశ్వరరావు ,ఏ ఐ టి యూ సి పిట్ సెక్రటరీ శ్రీ గ్ నరసింహారావు మరియు వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీ కె శ్రీనివాస్ పాల్గొన్నారు.




