20 June, 2026 | 2:40 AM

తన ఉగ్రవాదమే పాక్‌కు ముప్పు

20-06-2026 12:47 AM

యూఎన్‌హెచ్‌ఆర్సీలో భారత శాశ్వత ప్రతినిధి అనుపమసింగ్

జెనీవా, జూన్ 19: పాకిస్థాన్ ఉగ్రవాదంతోనే బలవుతోందని, తను పెంచి, పోషిం చిన పామే ఇప్పుడు ఆ దేశాన్ని కాటేస్తోందని భారత్ భారత శాశ్వత ప్రతినిధి అనుపమసింగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని వెల్లడించారు. సింధు ఒప్పందంపై భారత్ వైఖరిలో మార్పు ఉండదని,  పీవోకేను ఆక్రమించుకోవడమే.. ఎప్పటికీ పరిష్కారం కానీ సమస్య అని ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ కార్యదర్శి అనుపమ సింగ్ నిప్పులు చెరిగారు. పెద్దల సభలో భారత్‌పై పాక్ నిందలు వేయడానికి ప్రయత్నించి మరోసారి అనుపమసింగ్ చేతిలో భంగపడ్డది.