21 June, 2026 | 4:18 AM

ఇక్సిగో బంపర్ లిస్టింగ్

19-06-2024 12:05 AM

న్యూఢిల్లీ, జూన్ 18: ట్రావెల్ ప్లాట్ ఫాం ఇక్సిగోను నిర్వహిస్తున్న లే ట్రావెన్యూస్ టెక్నాలజీస్ మంగళవారం మంచి లాభాలతో లిస్టయ్యింది. ఈ కంపెనీ గతవారం జారీచేసిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది. 98 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయ్యింది. 4.37 కోట్ల షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తుండగా, 429.36 కోట్ల షేర్లకు బిడ్స్ అందా యి. దీంతో లా ట్రావెన్యూస్ టెక్నాలజీస్ ఐపీవో ధర రూ.93తో పోలిస్తే బొంబే స్టాక్ ఎక్సేంజ్‌లో 48 శాతం లాభంతో రూ.138 వద్ద లిస్టయ్యింది.

లిస్టింగ్ ధర నుంచి 20 శాతం పెరిగి  రూ.165.70 వద్ద ముగిసింది. ఈ ఆఫర్ రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 53.9 రెట్లు ఓవర్‌సబ్ స్క్రయిబ్ అయ్యింది. హై నెట్‌వర్త్ ఇన్వెస్టర్ల నుంచి 110 రెట్లు బిడ్స్ అందగా, సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం నుంచి 106.7 రెట్లు అధిక స్పందన లభించింది.  కంపెనీ రూ.120 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో జారీచేయగా, 6.66 కోట్ల షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో విక్రయించారు. ఐపీవో ప్రారంభానికి ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ. 333 కోట్లు సమీకరించింది.