21 June, 2026 | 3:03 AM

2030 కల్లా ట్రిలియన్ డాలర్లకు రియల్టీ రంగం

19-06-2024 12:05 AM
  • కొలియర్స్ రిపోర్ట్

న్యూఢిల్లీ, జూన్ 18: భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం గణనీయమైన మార్పులకు లోనవుతున్నదని, 2030కల్లా ఈ రంగం 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని రియల్టీ సర్వీసుల సంస్థ కొలియర్స్ అంచనా వేసి ంది. మౌలిక సదుపాయాలు మెరుగుదల, అందుబాటు ధరల్లో రియల్ ఎస్టేట్, నైపుణ్యంగల కార్మికుల లభ్యత తదితర అంశాలతో చిన్న  పట్టణాలు శరవేగంగా వృద్ధిచెందుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు అవుతున్నాయని కొలియర్స్ విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.

ఈ నేపథ్యంలో దేశీయ రియల్టీ రంగం 2030కల్లా 1 ట్రిలియన్ డాలర్లకు, 2050నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, దేశ జీడీపీలో 14 శాతం ఈ రంగానిదే ఉంటుందని వివరించింది. 2050కల్లా 10 లక్షలు జనాభా దాటిన నగరాల సంఖ్య 100కు చేరుకుంటుందని అంచనా వేసింది. మౌలిక సదుపాయాల కల్పన, డిజిటలైజేషన్, టూరిజం ఆఫీస్ ల్యాండ్‌స్కేప్‌లో మార్పులు కొత్త నగరాల ఆవిర్భావానికి దారితీస్తాయని, ఈ 100 నగరాల్లో 30 నగరాలు మధ్య, దీర్ఘకాలాలలో శరవేగంగా వృద్ధిచెందుతాయని, 17 నగరాల్లో రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ జోరుగా ఉంటుందని కొలి యర్స్ నివేదికలో అంచనా వేసింది. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, ఆతిథ్య, పారిశ్రామిక విభాగాల్లో రియల్ ఎస్టేట్ మూమెంటం ఉంటుందన్నది.