10 June, 2026 | 3:52 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

హైడ్రాకు చురకలు

24-03-2026 12:52 AM

బతుకమ్మ కుంట సమీపంలోని డిస్ప్యూట్ ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రహరీ, బోర్డులు తొలగించాలి

ఆదేశించిన హైకోర్టు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): హైడ్రాకు తెలంగాణ హైకోర్టు చురకలంటించింది. బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంట చెరువు సమీపంలో ఉన్న డిస్ప్యూట్ ల్యాండ్‌లో హైడ్రా ఏర్పాటు చేసిన ప్రహరీ, బోర్డులు తొలగించాలంటూ ఆదేశించింది. బతుకమ్మకుంట చెరువు భూములకు సంబంధించి ఎడ్ల సుధాకర్ రెడ్డి, హైడ్రా మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

అయితే 2025 కోర్టు తీర్పు ప్రకారం ఈ స్థలంపై యథాతథ స్థితిని పాటించాలని ఇచ్చిన కోర్టు ఆదేశాలు పాటించాలని ఆదేశించింది. ఈ పనులన్నింటినీ నాలుగు వారాల వ్యవధిలో పూర్తి చేయాలని హైడ్రాకు గడువు విధించింది. ఒకవేళ నిర్ణీత సమయంలోగా వీటిని తొలగించని పక్షంలో తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉంటాయని హెచ్చరించింది.