18 August, 2026 | 6:33 AM

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ

16-06-2024 11:33 AM

అమరావతి: ఏపీ పురపాలక శాఖ మంత్రిగా నారాయణ ఆదివారం బాధ్యతల స్వీకరించారు. పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారమే రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలోనే రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. రెండున్నరేళ్లలో అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తి చేస్తామన్న ఆయన సచివాలయం, అసెంబ్లీ, అధికారులు, ఉద్యోగుల ఇళ్లు పూర్తి చేస్తామని వెల్లడించారు. ప్రపంచ టాప్‌-5 రాజధానుల్లో అమరావతి ఉండాలని సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. రాజధాని నిర్మాణం వల్ల అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరుగుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.