11 March, 2026 | 11:11 AM

జగిత్యాల విద్యుత్ ఉద్యోగుల నిరసన

11-03-2026 12:00 AM

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకంగా ధర్నా 

జగిత్యాల, మార్చి 10 ( విజయక్రాంతి ) :జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా విద్యు త్ కార్యాలయం ఆవరణలో  విద్యుత్ ఉ ద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా జేఏసి నాయకులు మాట్లాడుతూ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను వెంటనే నిలిపి వేయాలని, ప్రైవేటీకరణతో ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు తీవ్రమయిన నష్టం తీరని అన్యాయం జరగడమే కాకుండ నిరుద్యోగులకి ప్రభుత్వ కొలువులు రావని చెప్పారు.

అలాగే రైతులకి, సామాన్య ప్రజలకి, చిన్న- మధ్య తరగతి పరిశ్రమలకు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అన్ని సబ్సిడీలను క్రమ క్రమంగా ఎత్తి వేయాల్సి వస్తుందని, విద్యుత్ చార్జీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో పెరుగుతాయని అలాగే ప్రజల సొ మ్ముతో కార్మికుల చెమటని చిందించి దశాబ్దాలుగా నిర్మించుకున్న వందలకోట్ల విలువైన లైన్స్ ని ప్రైవేట్ కంపెనీలకు నామ మాత్రపు చార్జీలకే ధారాదత్తం చేయవలసి వస్తుందని, కేంద్ర ప్ర భుత్వం ఎప్పుడైనా స్టేట్ ఇఆర్‌సీ సభ్యులని తీసివేసే అధికారం పొందనుందని, దీనివలన రాష్ట్రాల హక్కులకు భంగం ఏర్పడుతుంది అన్నారు.

ఈ బిల్లు ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ సంస్థలనుంచి విద్యుత్ ని అధిక ఛార్జీలకు కొనే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్ సవరణ బిల్లుని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మా నిరసనలు ఆగవని ఇంకా ఉదృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమములో ఎస్ ఈ సుదర్శనం , డి ఈ లు గంగారాం, మదసూదన్, గోపి కృష్ణ, ఎస్ ఏ ఓ శ్రీనివాస్, జేఏసి నా యకులు చేరాలు, ఆర్ముల్ల ప్రసాద్, రాంజీ నాయక్, వరుణ్ కుమార్, జవహర్ నాయక్, సతీష్, ప్రవీణ్, ఆంజనేయులు, రహీమ్, అశోక్ రెడ్డి, భూమయ్య, అభీద్, అజీజు, పలు సంఘాల నాయకులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు.