calender_icon.png 30 June, 2025 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా జైపాల్ రెడ్డి

29-06-2025 09:05:10 PM

కామారెడ్డి రోటరీ క్లబ్ కు ఉత్తమ అవార్డు..

కామారెడ్డి (విజయక్రాంతి): రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ గా కామారెడ్డి ఆర్కే విద్యాసంస్థల చైర్మన్ సీఈవో జైపాల్ రెడ్డి(RK Educational Chairman Jaipal Reddy) ఎంపికయ్యారు. హైదరాబాద్లో నిర్వహించిన పలు రకాల అవార్డ్స్ లో కామారెడ్డి రోటరీ క్లబ్ ఉత్తమ అవార్డు సాధించింది. ఉత్తమ సేవలందించినందుకు దిష్టి గవర్నర్ చౌదరి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కామారెడ్డి రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజనర్సింహారెడ్డి చేపట్టిన కార్యక్రమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్న వారిలో కామారెడ్డి రోటేరియన్స్ శ్రీశైలం, కాశీనాథం, పున్న రాజేష్, వై శంకర్, సుధాకర్ రావు, సబ్బని కృష్ణ హరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.