10-06-2025 04:37:52 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్(BC Welfare Association President Jajula Srinivas Goud) పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం మునుగోడు నియోజకవర్గం అధ్యక్షులు వీరమల్ల కార్తీక్ ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తాలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ గౌడ్ మాట్లాడుతూ... బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా బీసీల ఉనికిని చాటిన గొప్ప వ్యక్తి జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీలలో రాజకీయంగా చైతన్యం తీసుకువచ్చిన జాజుల శ్రీనివాస్ గౌడ్ కు బీసీ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.