వెలవెలబోతున్న విత్తన మేళాలు
మహబూబాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): విత్తన మేళాలకు రైతులు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో పలు మండలాల్లోని ఏర్పాటు చేసిన వెలవెలబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రాష్ట్రవ్యాప్తం గా ఈనెల 23 నుండి 30 వరకు ‘విత్తనమేళ’ నిర్వహిస్తోంది. రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, ప్రభుత్వం ప్రో త్సహిస్తున్న ఏడు రకాల సన్న వడ్ల సాగుపై అవగాహన కల్పించడం, విత్తన కంపెనీలు, వ్యాపార సంస్థల ద్వారా సాంకేతిక సూచన లు అం దించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. అయితే మొదటిరోజు ఆరంభ షూరత్వంగా ప్రారంభించిన విత్తన మేళా..
తర్వాత రైతుల నిరాదరణలతో రైతు వేదికలు విత్తన కంపెనీల పేర్లతో ఏర్పాటు చేసిన స్టాళ్లలో కేవలం బ్యానర్లు, విత్తన బస్తాలు, ఖాళీ కుర్చీలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. వర్షాలు ప్రారంభం కావడంతో చాలాచోట్ల రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన విత్తన మేళాకు ఆశించిన ఆదరణ లభించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా రైతు లు లేకుండా ఖాళీ కుర్చీలతో బోసిపోయి కనిపించింది.






