27 July, 2026 | 5:06 PM

గౌరాయిపల్లిలో వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం

27-07-2026 04:34 PM

యాదగిరిగుట్ట, జూలై 28 (విజయక్రాంతి): రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నుండి సకాలంలో వర్షాలు కురువాలని యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో మహిళలు బొడ్రాయి, వీరభద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక జలాభిషేకం, బతుకమ్మ కార్యక్రమంను నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో దేశంలోనూ రాష్ట్రంలోనూ వర్షాలు కురవక సకల జీవకోటి ఇబ్బందులకు గురవుతున్నాయని వరుణ దేవా సకాలంలో వర్షాలు కురిసి, రైతుల, గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుతూ  ప్రత్యేక జలాభిషేకం, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేసిరెడ్డి శోభ రవీందర్ రెడ్డి, కల్లూరి మల్లారెడ్డి, సిరికొండ నరసింహులు, పన్నీరుభరత్ ,గొట్టం కృష్ణారెడ్డి,బత్తిని శ్రీను,, పన్నీరు భాను, భైర ప్రభాకర్ ,వార్డు సభ్యులు,గ్రామ మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు  పాల్గొన్నారు.