29 July, 2026 | 2:12 AM

‘జలసిరి’ని విజయవంతం చేయాలి

29-07-2026 12:33 AM
  1. తక్కువ నీటితో పండే పంటలు సాగు చేయాలి
  2. అదనపు కలెక్టర్ కిరణ్మయి 

మొయినాబాద్, జూలై 28(విజయ క్రాంతి): భూగర్భ జలాల పరిరక్షణ, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులు తక్కువ నీటి అవసరమున్న పంటల సాగుపై దృష్టి పెట్టాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కొప్పిశెట్టి కిరణ్మయి సూచించారు. మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డిగూడ గ్రా మంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ని ర్వహించిన గ్రామసభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ, ప్రభుత్వం చేపట్టిన ఇంటికి ఒక ఇం కుడు గుంత  ప్రతి పొలానికి పంటకుంట  ప్రతి ఊరికి ఒక ఊటకుంట అనే నినాదంతో జలసిరి కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలు, ఫార్మ్ పాండ్లు, ఊటకుంటలు ఏ ర్పాటు చేసుకుంటే భూగర్భ జలాలు పెరిగి రైతులకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్ మాట్లాడుతూ,

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుం డా మురుగునీరు నిల్వ లేకుండా గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూ చించారు. ఏవో అనూరాధ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో హిమబిందు, ఏఓ దీనా, ఎంపీవో విక్రాంత్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్ గౌడ్, ప్రవీణ్ కళ్యాణ్, నాయకులు పాల్గొన్నారు.