మల్‌రెడ్డిని కలిసిన బెటాలియన్ అధికారులు
ఆగస్టు 3న ప్రారంభోత్సవాలకు రావాలని ఆహ్వానం-
ఇబ్రహీంపట్నం, జూలై 28 (విజయక్రాంతి): తెలంగాణ స్పెషల్ పోలీస్ మూడో బెటాలియన్ అధికారులు, సిబ్బంది.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిశారు. బెటాలియన్ కమాండెంట్ సయ్య ద్ జమీల్ బాష, అసిస్టెంట్ కమాండెంట్లు వీ రయ్య, ఆర్.పాండులు.వివిధ కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఆగస్టు 3న బెటాలియ న్‌కు రావాలని ఆహ్వానించారు. నాగన్‌పల్లి రోడ్డు నుంచి బెటాలియన్ గేటు వరకు హెచ్‌ఎండీఏ నిధులతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తో నిర్మించిన అప్రోచ్ రోడ్డు పూర్తికాగా.
ఈ మేరకు వారు తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా హెచ్‌ఆర్‌ఏ ఫైల్ అంశాన్ని వారు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. గత డిసెంబర్ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరణ నేపథ్యంలో పెరిఫరీ 8 కిలోమీటర్లలోపు తమ బెటాలియన్ ఉన్నందున. కలెక్టర్ వద్ద ఉన్న ఇంటి అద్దె పెంపు ఫైల్ ను త్వరగా నోటిఫై చేయించాల్సిందిగా కోరారు. వెంటనే స్పందించిన మల్ రెడ్డి.ఫోన్లో కలెక్టర్ తో చర్చించారు. ఎమ్మెల్యే చొరవ పట్ల బెటాలియన్ అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.






