4 July, 2026 | 12:43 AM

వీ హనుమంతరావుకు జానారెడ్డి పరామర్శ

04-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పరామర్శించారు. ఖైరతాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్ వద్దకు శుక్రవారం జానారెడ్డి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఏసియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీ ఎండీ డాక్టర్ పూర్ణచంద్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని జానారెడ్డి ఆకాంక్షించారు.