31-07-2025 05:33:54 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మేడి వినయ్ వైద్య సహాయానికి దాతల సహకారంతో గురువారం రూ.24 వేలు ఆర్థిక సాయం చేశారు. బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామానికి చెందిన మేడి వినయ్ కుటుంబ సభ్యులకు రూ.24,000/- చెక్ ని జనహిత సేవా సమితి ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామానికి చెందిన మేడి వినయ్, 27 ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో బెల్లంపల్లి సాయి బాబా గుడి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్,
బైక్ ఢీకొని తీవ్ర గాయలై ప్రాణాపాయ స్థితిలో మంచిర్యాల లోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారి తండ్రి మేడి శ్రీనివాస్ కూలి పని చేస్తు వినయ్ వంట పని క్యాటరింగ్ చేస్తు జీవనం సాగిస్తున్న ఆ కుటుంబానికి వైద్య ఖర్చులు ఆర్థిక భారం కావడంతో జనహిత సేవా సమితి దాతల నుండి విరాళాలు సేకరించిన మొత్తం రూ.24,000/ చెక్ ని వారి కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. పెద్ద మనసుతో సహకారం అందించిన దాతలు ప్రతి ఒక్కరికి జనహిత సేవా సమితి తరుపున కృతజ్ఞతలు తెలిపారు.