01-08-2025 12:55:51 PM
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటిస్తున్నారు. వైటీపీఎస్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు మంత్రులు శంకుస్థానన చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Council Chairman Gutha Sukender Reddy) టౌన్ షిప్ శంకుస్థాపనలో పాల్గొన్నారు. 55 ఎకరాల్లో రూ. 970 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ నిర్మాణం చేపట్టారు. వన మహోత్సవంలో భాగంగా మంత్రులు వైటీపీఎస్‌లో మొక్కలు నాటారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), మంత్రులు భూనిర్వాసితులతో మాట్లాడారు. ఆగస్టు 15లోపు భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని మంత్రులు తెలిపారు. వైటీపీఎస్ లో యూనిట్-1ను మంత్రులు జాతికి అంకితం చేశారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్-1 జాతికి అంకితం చేశారు.