calender_icon.png 2 August, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాంతర అభివృద్ధి మా లక్ష్యం

01-08-2025 12:58:34 PM

  1. గడిచిన పదేళ్లలో చెయ్యని పనులను చేస్తున్నాం 
  2.  మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): సమాంతర అభివృద్ధి తమ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahbubnagar MLA Yennam Srinivas Reddy) అన్నారు. శుక్రవారం ఎదిర శివాలయం  ఆవరణలో రూ 10 లక్షల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మల్టీ పర్పస్ షెడ్ నిర్మాణపు పనులకు,  హౌసింగ్ బోర్డు కాలనీ లో రూ 10 లక్షల ముడా నిధులతో పార్కు పునరుద్ధరణ పనుల నిమిత్తం రూ 12 లక్షలతో ఏర్పాటు చేయనున్న మహిళా జిమ్ నిర్మాణపు పనులకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే(Mahabubnagar MLA) యెన్నం శ్రీనివాస్ రెడ్డి  భూమి పూజ నిర్వహించారు. అంతకుముందు శివాలయంలో  కొలువైన  మహాశివుని దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి వేద ఆశీర్వాదం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో ఆ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. కాలయాపన చేసి కాలం గడిపిందని వ్యక్తిగత లాభాలకే వారు పరిమితమయ్యారని విమర్శించారు. ప్రజా పాలనలో ప్రతి ఒక్కరి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు అడుగులు వేయడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, అజ్మత్ అలి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు  హనుమంతు, ఖాజా పాషా, రషెద్ ఖాన్, అంజద్, అచ్చుగట్ల అంజయ్య, రామాంజనేయులు, నాయకులు రమేష్ యాదవ్, రాములు బచ్చన్న, చర్ల శ్రీనివాసులు, గ్యాస్ అంజి, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.