01-08-2025 01:12:54 PM
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) శుక్రవారం సాయంత్రం రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఉదయం 9 గంటలకు భారత జాతీయ కాంగ్రెస్, చట్టం, మానవ హక్కులు, ఆర్టీఐ విభాగం నిర్వహించే వార్షిక సమావేశంలో పాల్గొననున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం ,మంత్రులు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు.