02-02-2026 05:21:59 PM
శామీర్ పేట్,(విజయక్రాంతి): మున్సిపాలిటీ ఎన్నికల్లో జెనసేన పార్టీ నుండి గెలిచిన అభ్యర్థులకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలంగాణ జెనసేన ఇన్ఛార్ శెంకర్ గౌడ్ అన్నారు. సోమవారం అలియాబాద్ మున్సిపాలిటీ తుర్కపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలో జెనసేన పార్టీ నుండి గెలిచిన వార్డ్ ను జెనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నిధులు కేటాయించి అన్ని వార్డ్ ల కంటే అభిహృది లో మొదటి స్థానంలో ఉంచుతామని హామీ ఇచ్చారన్నారు. జెనసేన పార్టీ కార్యకర్తలు 100 కు 500 లకు అమ్ముడుపోయేవాళ్ళు కాదన్నారు. అనంతరం పార్టీ అభ్యర్డులకు బిఫార్మ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దిరాజు,షైక్ ఇబ్రహీం , మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.