15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సీఎం కప్‌లో ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచిన బొల్లారం

02-02-2026 05:25 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల స్థాయి సీఎం కప్పు క్రీడాల్లో భాగంగా మండలంలోని జెడ్పిహెచ్ఎస్ బొల్లారం పాఠశాల విద్యార్థులు ఓవరాల్ ఛాంపియన్గా నిలిచారని పాఠశాల పిడి.సుకుమార్ తెలిపారు. కబడ్డీ, కోకో పోటీల్లో బాలురు మొదటి స్థానం, కోకో, వాలీబాల్ పోటీలో బాలికలు మొదటి స్థానం, పరుగు పందెం 100 మీటర్లు మొదటి స్థానంలో పాఠశాల విద్యార్థులు నిల్చారని పిడి.సుకుమార్ తెలిపారు. మండల స్థాయిలో నిలిచిన సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్, ఉపాధ్యాయుల బృందం పిడి. సుకుమార్ను విద్యార్థులు,గ్రామస్తులు సమక్షంలో ఘనంగా శాలువతో సన్మానించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రభు గౌడ్ మాట్లాడుతూ ఇలాగే విద్యార్థులు క్రీడాలో మరింత ప్రతిభను కనబరిచి పైస్థాయికి ఎదగాలని తెలిపారు. ఒక విద్యార్థికి ఒక కళ ఉంటుంది ఇప్పటినుండే విద్యార్థి అనేది ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే బంగారు భవిష్యత్తు బాగుంటుందన్నారు. అప్పుడు తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి గర్వంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.