29 August, 2026 | 12:45 AM

మార్కండేయ మందిరంలో వైభవంగా జంధ్యాల పౌర్ణమి

29-08-2026 12:07 AM

గాంధారి, ఆగస్టు 28 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో శ్రావణ పౌర్ణమి పురస్కరించుకుని జంధ్యాల పౌర్ణమి వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన యజ్ఞోపవీతాలను ధరించారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తులు సామూహికంగా జంధ్యాలు మార్చుకున్నారు.

పాత జంధ్యాలను తొలగించి, ఆచారం ప్రకారం నూతన జంధ్యాలను ధరించి మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు గుంటుకు అశోక్, పట్టణ అధ్యక్షులు క్యాతం కృష్ణ, ఉపాధ్యక్షులు సామల రాజు, ప్రధాన కార్యదర్శి సామల విజయ్, కోశాధికారి తాటి పాముల శివకుమార్, సలహాదారులు సంతోష్, ప్రభు, నారాయణ, శ్రీహరి, శ్రీనివాస్, గంగ కిషన్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు..