29 August, 2026 | 1:10 AM

కలెక్టరేట్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

29-08-2026 12:06 AM

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 28 (విజయక్రాంతి): క్రీడా ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ వారి ఆదేశానుసారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అనుమతితో జిల్లా కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాలులో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను శుక్రవారం జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్, జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నవీన్ రెడ్డి ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ క్రీడారంగానికి ధ్యాన్ చంద్ చేసిన సేవలను ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు. ఈ వేడుకలలో కార్యాలయ సిబ్బంది, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.